Friday, 4 November 2016

కొత్తిమీర రోజు తినండి ఆరోగ్యంగా ఉండండి....


కూరలూ, మసాలా వంటకాల్లో అదనపు రుచి కోసం కొత్తిమీరను వేస్తాం. అలానే దానితో రైస్‌, చట్నీ చేసుకుంటాం. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ కొత్తమీర ఆరోగ్యానికి ఎలా మేలుచేస్తుందంటే..

Image result for coriander

  • బీపీ అదుపులో: రక్తపోటుతో బాధపడేవారికి కొత్తిమీర మేలు చేస్తుంది. రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. ఒత్తిడీ తగ్గుతుంది. హృద్రోగాలు ఉన్నవారికీ కొత్తిమీర మంచిది.
  • రక్తహీనత దూరం: చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతుంటారు. అలాంటివారు కొత్తిమీరను ఎంత తీసుకుంటే అంత మంచిది. దీనిలో ఇనుము శాతం ఎక్కువ. అది రక్తకణాల వృద్ధిని పెంచి, రక్తహీనతను దూరం చేస్తుంది. వూపిరి సరిగా అందక బాధపడేవారు ఉదయాన్నే కొత్తిమీర రసం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • నోటిపుండ్లు ఉంటే: కాలమేదైనా సరే కొందరు నోటి పూతతో బాధపడుతుంటారు. అలాంటి వారు కొత్తిమీర తీసుకోవాలి. వాటిలో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు అధికం. దీన్ని తినడం వల్ల నోటిపుండ్లు వెంటనే తగ్గిపోతాయి. రోజులో మూడు సార్లు కొత్తిమీర ఆకులను నములుతూ, రసాన్ని దవడన ఉంచుకొని మెల్లగా మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా నోటిపూత తగ్గుతుంది.
  • ఎముక పుష్టికి: కొత్తిమీరలో క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మహిళలు కొత్తిమీరను తీసుకోవడం వల్ల ఎముక సాంద్రత తగ్గకుండా ఉంటుంది. చిన్నవయసు నుంచే పిల్లలకు ప్రతిరోజూ తినడం అలవాటు చేయాలి. ఎముకలు దృఢంగా మారి..చక్కగా ఎదుగుతారు.
  • చర్మానికి: కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఫంగల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు అధికం. ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చర్మసంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి. ఎగ్జిమా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో కొత్తిమీర చేర్చుకోవాల్సిందే. అలానే పరగడుపున కొన్ని ఆకులు నమలడం అలవాటు చేసుకుంటే జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది.

ఎండుద్రాక్ష మీ ఆరోగ్యానికి ఏంత మేలు చేస్తుందో చూడండి.....

ఎండుద్రాక్ష ని రోజూ తినడం వలన మన శారీరనికి, ఆరోగ్యనికి కూడా చాలా లాభాలు ఉన్నాయి, అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం....

Image result for kissmiss

  • ఎండుద్రాక్ష లో పీచు పదార్దం ఎక్కువగా ఉండడం వలన అది మన శరీరానికి కావలసిన పోషక విలువలను అందజేస్తుంది. చాలామంది అజీర్తి, రకరకాల కారణాల వల్ల మలబద్దకం తో బాధపడుతుంటారు. అలాంటివారు ఎండుద్రాక్షను తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు పెరుగుతుంది . ఆ సమస్యా తగ్గుముఖం పడుతుంది.
  • ప్రతి రోజూ అమ్మాయిలు ఏండుద్రాక్ష ని తీసుకోవడం వలన వారీలో ఉన్నటువంటి రక్తహీనత చాలవరకు అదుపులో ఉంటుంది. రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నవారు ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల ఇనుము, రాగి, విటమిన్‌ బి పోషకాలు శరీరానికి అందుతాయి. దీని ద్వారా రక్తహీనత సమస్యా తగ్గుతుంది
  • బరువు తగ్గలనుకునే వారికి ఇది ఒక మంచి ఔషదంల పని చేస్తుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన రోగ నీరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఎండు ద్రాక్ష లో ఉన్నటువంటి గ్లూకోజ్‌ శరీరానికి మంచి శక్తినిస్తుంది.
  • చిన్నపిల్లలకు, ఆటలు ఎక్కువగా ఆడేవారికి ఎండుద్రాక్ష ని రోజూ తినడం వలన దానీ లో ఉండే క్యాల్షియం, బోరాన్‌ పోషకాలు ఎముకలకు బలాన్నిస్తాయి. వీటి ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌, క్యాన్సర్‌ కారకాలూ దూరమవుతాయి.

జామ పండు తో సంపూర్ణమైన ఆరోగ్యం...

Image result for guava pics
సహజంగా ఈ రోజులలో మనకి జామపండు అధికంగా దొరుకుంది ఏ వయస్సువారు అయిన తినగలిగే పండు జామపండు దానివలన ఎన్ని ప్రయొజనాలు ఉన్నయో ఇప్పుడు మనం చూద్ధాం.......
  • మనం జామ పండును రోజూ తినడం వలన శరీరానికి కావలిసినటువంటి సోడియం, పొటాషియం పుష్కలంగా అందుతాయి. ఫలితంగా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.దీని ద్వార గుండెకి సంబంధించిన రోగాలు దూరంగా ఉంటాయి .
  • జామ పండు లో ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి9  అధికంగా ఉంటాయి . గర్భిణులు తింటే గర్భస్థ శిశువు ఎదుగుదల బాగుంటుంది. జామ  పండు లో ఉండే మెగ్నీషియం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కండరాల నొప్పులు బాధించవు
  • మధుమేహం ఉన్నవారు జామ పళ్లు ఎంత తింటే అంత మంచిది. వీటిలో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.
  •  ఎ, సి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, కెరొటిన్లు జామపండ్లలో అధికం. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తాయి. ప్రతిరోజూ ఓ పండును తినడం మంచిది.
  •  మలబద్దకం సమస్య ఉన్నవారు జామ పండ్లను ఎక్కువగా తినాలి. ఒక జామ పండులో 12%  పీచు పదార్దం  ఉంటుంది. ప్రతిరోజూ దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మలబద్దకం అనే  సమస్య ఉండదు.
  • జామ పండు లో కళ్లకు మేలు చేసే విటమిన్‌ ఎ ఉంటుంది. ఇవి తినడం వల్ల చూపు స్పష్టంగా ఉంటుంది.