Friday, 4 November 2016

ఆకుకూరలతో పళ్లు ఆరోగ్యంగా...


చిన్నవారికయినా, పెద్దవాళ్లకయినా దంత సంబంధ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఎలాంటి ఆహారం తీసుకుంటే చిగుళ్లూ, దంతాలు దృఢంగా మారతాయంటే...




ఆకుకూరలు: శరీరానికి కావల్సిన విటమిన్లు, ఖనిజాలూ అందితే దంతాలు దృఢంగా ఉంటాయి. అవి ఎక్కువగా అరటికాయ, బెండ, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరల్లో ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మాంసాహారం: ఫాస్పరస్‌ అందడం వల్ల కూడా దంతాలు దృఢపడతాయి. మాంసం, చేపలు, టోఫు తినడం మంచిది. ఇవి తీసుకోవడం వల్ల అత్యవసరమైన ఖనిజాలు అంది.. పళ్లపై ఉండే ఎనామిల్‌ కూడా గట్టిపడుతుంది. దాంతోపాటు అతి పుల్లగా ఉండే పదార్థాలూ, గట్టిగా ఉండే వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. 

Image result for CURD PICS

చీజ్‌, పెరుగు: పాల పదార్థాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కూడా దంతాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఎనామిల్‌ పూత పోకుండా సాయపడతాయి. కొవ్వు తక్కువగా ఉన్న చీజ్‌ ఎంచుకోవాలి. అలానే వెన్నలేని పాలతో చేసిన పెరుగు తినాలి.
గుడ్లు: క్యాల్షియం ఎక్కువగా ఉండే గుడ్లను ప్రతిరోజూ తీసుకోవాలి. గుడ్డులోని సొన దంతాలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. చిన్నారులకు ఇవ్వడం వల్ల దంతాలతోపాటు, ఎముకలూ బలంగా మారతాయి. 

Image result for APPLE PICS

పండ్లూ, కూరగాయలు: క్యారెట్‌, యాపిల్‌ వంటివి బాగా తినాలి. వీటిని నమలడం వల్ల లాలాజలం వృద్ధి అవుతుంది. ఫలితంగా మేలు చేసే ఎంజైములు విడుదలవుతాయి. పళ్ల మధ్యలో ఉన్న బ్యాక్టీరియా దూరమవుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లూ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలకు ఎంతో మేలు జరుగుతుంది.

No comments:

Post a Comment