మన ఇంట్లో కొబ్బరి ఉందంటే కూరల్లో వేయడమో, పచ్చడి చేయడమో చాలామందికి అలవాటు. అయితే ఈ కొబ్బరి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో మీరే చూడండి.
- మనం రోజూ ఒక చిన్న కొబ్బరి ముక్క తినడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. చర్మానికీ ఏంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా మన శరీరంలో ఉన్న వ్యర్ద్య పదార్దాలు బయటకు పోతాయి. ఎక్కువగా అమ్మాయిలలో కనిపించే వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉంటాయి.
- పచ్చి కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉండడం వలన, ఇవి రోగనిరోధక శక్తిని పేంచడానికి దోహదపడతాయి. ఎక్కువగా ఆటలాడే పిల్లలు తినడం వలన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
- గుండె సంబంధిత సమస్యలున్నవారు కొబ్బరి తింటే చాలా మంచిది. దీనిలో మేలు చేసే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరి మంచి ఔషధంలాంటిది.
- పచ్చికొబ్బరిలో థయామిన్, బికాంప్లెక్స్ విటమిన్లు,రైబోఫ్లెవిన్, ఫొలేట్లు, నియాసిన్, వంటివి లభిస్తాయి. అంతేకాకుండా మాంగనీస్, ఫాస్పరస్,సెలీనియం, ఇనుము, జింక్, రాగి, లాంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. ఇవన్నీ శరీరానికి అందడం వల్ల జీవక్రియ రేటు సక్రమంగా ఉంటుంది. చర్మం, ఎముకలూ, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
No comments:
Post a Comment