Friday, 4 November 2016

జామ పండు తో సంపూర్ణమైన ఆరోగ్యం...

Image result for guava pics
సహజంగా ఈ రోజులలో మనకి జామపండు అధికంగా దొరుకుంది ఏ వయస్సువారు అయిన తినగలిగే పండు జామపండు దానివలన ఎన్ని ప్రయొజనాలు ఉన్నయో ఇప్పుడు మనం చూద్ధాం.......
  • మనం జామ పండును రోజూ తినడం వలన శరీరానికి కావలిసినటువంటి సోడియం, పొటాషియం పుష్కలంగా అందుతాయి. ఫలితంగా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.దీని ద్వార గుండెకి సంబంధించిన రోగాలు దూరంగా ఉంటాయి .
  • జామ పండు లో ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి9  అధికంగా ఉంటాయి . గర్భిణులు తింటే గర్భస్థ శిశువు ఎదుగుదల బాగుంటుంది. జామ  పండు లో ఉండే మెగ్నీషియం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కండరాల నొప్పులు బాధించవు
  • మధుమేహం ఉన్నవారు జామ పళ్లు ఎంత తింటే అంత మంచిది. వీటిలో గ్లైసమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ. రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయి.
  •  ఎ, సి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, కెరొటిన్లు జామపండ్లలో అధికం. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తాయి. ప్రతిరోజూ ఓ పండును తినడం మంచిది.
  •  మలబద్దకం సమస్య ఉన్నవారు జామ పండ్లను ఎక్కువగా తినాలి. ఒక జామ పండులో 12%  పీచు పదార్దం  ఉంటుంది. ప్రతిరోజూ దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మలబద్దకం అనే  సమస్య ఉండదు.
  • జామ పండు లో కళ్లకు మేలు చేసే విటమిన్‌ ఎ ఉంటుంది. ఇవి తినడం వల్ల చూపు స్పష్టంగా ఉంటుంది.

No comments:

Post a Comment