Friday, 4 November 2016

కొత్తిమీర రోజు తినండి ఆరోగ్యంగా ఉండండి....


కూరలూ, మసాలా వంటకాల్లో అదనపు రుచి కోసం కొత్తిమీరను వేస్తాం. అలానే దానితో రైస్‌, చట్నీ చేసుకుంటాం. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ కొత్తమీర ఆరోగ్యానికి ఎలా మేలుచేస్తుందంటే..

Image result for coriander

  • బీపీ అదుపులో: రక్తపోటుతో బాధపడేవారికి కొత్తిమీర మేలు చేస్తుంది. రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. ఒత్తిడీ తగ్గుతుంది. హృద్రోగాలు ఉన్నవారికీ కొత్తిమీర మంచిది.
  • రక్తహీనత దూరం: చాలామంది మహిళలు రక్తహీనతతో బాధపడుతుంటారు. అలాంటివారు కొత్తిమీరను ఎంత తీసుకుంటే అంత మంచిది. దీనిలో ఇనుము శాతం ఎక్కువ. అది రక్తకణాల వృద్ధిని పెంచి, రక్తహీనతను దూరం చేస్తుంది. వూపిరి సరిగా అందక బాధపడేవారు ఉదయాన్నే కొత్తిమీర రసం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • నోటిపుండ్లు ఉంటే: కాలమేదైనా సరే కొందరు నోటి పూతతో బాధపడుతుంటారు. అలాంటి వారు కొత్తిమీర తీసుకోవాలి. వాటిలో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు అధికం. దీన్ని తినడం వల్ల నోటిపుండ్లు వెంటనే తగ్గిపోతాయి. రోజులో మూడు సార్లు కొత్తిమీర ఆకులను నములుతూ, రసాన్ని దవడన ఉంచుకొని మెల్లగా మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా నోటిపూత తగ్గుతుంది.
  • ఎముక పుష్టికి: కొత్తిమీరలో క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మహిళలు కొత్తిమీరను తీసుకోవడం వల్ల ఎముక సాంద్రత తగ్గకుండా ఉంటుంది. చిన్నవయసు నుంచే పిల్లలకు ప్రతిరోజూ తినడం అలవాటు చేయాలి. ఎముకలు దృఢంగా మారి..చక్కగా ఎదుగుతారు.
  • చర్మానికి: కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీఫంగల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు అధికం. ప్రతిరోజూ తీసుకోవడం వల్ల చర్మసంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి. ఎగ్జిమా, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో కొత్తిమీర చేర్చుకోవాల్సిందే. అలానే పరగడుపున కొన్ని ఆకులు నమలడం అలవాటు చేసుకుంటే జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగవుతుంది.

No comments:

Post a Comment