Wednesday, 9 November 2016

కొబ్బరితో ఏన్ని ప్రయోజనాలో.....

మన ఇంట్లో కొబ్బరి ఉందంటే కూరల్లో వేయడమో, పచ్చడి చేయడమో చాలామందికి అలవాటు. అయితే ఈ కొబ్బరి మన ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో మీరే చూడండి.
Image result for coconut pics

  • మనం రోజూ ఒక చిన్న కొబ్బరి ముక్క తినడం వలన జీర్ణశక్తి మెరుగుపడుతుంది. చర్మానికీ ఏంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా మన శరీరంలో ఉన్న వ్యర్ద్య పదార్దాలు బయటకు పోతాయి. ఎక్కువగా అమ్మాయిలలో కనిపించే వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉంటాయి.
  • పచ్చి కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉండడం వలన, ఇవి రోగనిరోధక శక్తిని పేంచడానికి దోహదపడతాయి. ఎక్కువగా ఆటలాడే పిల్లలు తినడం వలన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.
  • గుండె సంబంధిత సమస్యలున్నవారు కొబ్బరి తింటే చాలా మంచిది. దీనిలో మేలు చేసే కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉంటుంది. అది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కొబ్బరి మంచి ఔషధంలాంటిది.
  • పచ్చికొబ్బరిలో థయామిన్‌, బికాంప్లెక్స్‌ విటమిన్లు,రైబోఫ్లెవిన్‌, ఫొలేట్లు, నియాసిన్‌, వంటివి లభిస్తాయి. అంతేకాకుండా మాంగనీస్‌, ఫాస్పరస్‌,సెలీనియం, ఇనుము, జింక్‌, రాగి, లాంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. ఇవన్నీ శరీరానికి అందడం వల్ల జీవక్రియ రేటు సక్రమంగా ఉంటుంది. చర్మం, ఎముకలూ, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

Tuesday, 8 November 2016

గుండె బలంగా ఉండాలంటే.........

భవిష్యత్తులో వచ్చే గుండె జబ్బులను  నివారీంచడానికి మనం చిన్నవయస్సు నుంచే ఆహారం విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది అవేంటంటే ఇప్పుడు మనం చూదాం...

Image result for fish curry pics


చేపలు
: మన ఆరోగ్యానికి చేపలు చాలా ముఖ్యమైనవి. వీటిని తినడం వలన మనిషి చాలా ఆరోగ్యం గా ఉంటాడు. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు హృదయ స్పందనలు అదుపు తప్పకుండా చూస్తాయి. గుండె కవాటాలు తెరుచుకుని ఉండటానికి చేపలు ఉపయోగపడతాయి. ఫలితంగా గుండెలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు.

Image result for strawberry pics
 

స్ట్రాబెర్రీ: ఇందులో మన శరీరానికి మేలు చేసే పైటోన్యూట్రియంట్లు, ఫ్లవనాయిడ్లు ఉంటాయి. ఇవి రక్తప్రసరణ సక్రమంగా సాగేలా చేస్తాయి. రక్తనాళాలు ముడుచుకోకుండా ఉంచుతాయి. గుండెకు సక్రమంగా రక్తప్రసరణ జరిగి ఏటువంటి  సమస్యలూ దగ్గరికి చేరనీవ్వవు.
Image result for oranges


నిమ్మజాతి పండ్లు: విటమిన్‌ సి పుష్కలంగా ఉండే నిమ్మపండు , కమలాపండు , నారింజపండు , బత్తాయిపండు వంటి వాటిని నిత్యం తీసుకోవడం మంచిది. వీటీలో ఉన్నటువంటి విటమిన్‌ సి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.

Friday, 4 November 2016

ఆకుకూరలతో పళ్లు ఆరోగ్యంగా...


చిన్నవారికయినా, పెద్దవాళ్లకయినా దంత సంబంధ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అసలు ఎలాంటి ఆహారం తీసుకుంటే చిగుళ్లూ, దంతాలు దృఢంగా మారతాయంటే...




ఆకుకూరలు: శరీరానికి కావల్సిన విటమిన్లు, ఖనిజాలూ అందితే దంతాలు దృఢంగా ఉంటాయి. అవి ఎక్కువగా అరటికాయ, బెండ, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరల్లో ఉంటాయి. వీటిలో ఉండే పోషకాలు దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
మాంసాహారం: ఫాస్పరస్‌ అందడం వల్ల కూడా దంతాలు దృఢపడతాయి. మాంసం, చేపలు, టోఫు తినడం మంచిది. ఇవి తీసుకోవడం వల్ల అత్యవసరమైన ఖనిజాలు అంది.. పళ్లపై ఉండే ఎనామిల్‌ కూడా గట్టిపడుతుంది. దాంతోపాటు అతి పుల్లగా ఉండే పదార్థాలూ, గట్టిగా ఉండే వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. 

Image result for CURD PICS

చీజ్‌, పెరుగు: పాల పదార్థాల్లో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కూడా దంతాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. ఎనామిల్‌ పూత పోకుండా సాయపడతాయి. కొవ్వు తక్కువగా ఉన్న చీజ్‌ ఎంచుకోవాలి. అలానే వెన్నలేని పాలతో చేసిన పెరుగు తినాలి.
గుడ్లు: క్యాల్షియం ఎక్కువగా ఉండే గుడ్లను ప్రతిరోజూ తీసుకోవాలి. గుడ్డులోని సొన దంతాలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. చిన్నారులకు ఇవ్వడం వల్ల దంతాలతోపాటు, ఎముకలూ బలంగా మారతాయి. 

Image result for APPLE PICS

పండ్లూ, కూరగాయలు: క్యారెట్‌, యాపిల్‌ వంటివి బాగా తినాలి. వీటిని నమలడం వల్ల లాలాజలం వృద్ధి అవుతుంది. ఫలితంగా మేలు చేసే ఎంజైములు విడుదలవుతాయి. పళ్ల మధ్యలో ఉన్న బ్యాక్టీరియా దూరమవుతుంది. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లూ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలకు ఎంతో మేలు జరుగుతుంది.